Songs Home Page All Telugu Christian Songs All BOUI Songs
తెల్లని గుఱ్ఱములెక్కి యేసుని వెంబడించి
బైబిల్ చేతపట్టి ప్రతి మనిషికి బుద్ధి చెప్పి
దేవుడు లేడని చెప్పే వాడితో యుద్ధం
బైబిల్ తప్పని చెప్పే వాడితో యుద్ధం
2012 కి యుగాంతమే రాదు డిసెంబర్ 21 నాశనం కాదు
యుద్ధం చేసేది మేమే సత్యం చెప్పేది మేమే
విశ్వం గూర్చి చెప్పిన గ్రంథమిదే..
నువ్వు చెప్పింది జరుగకపోతే బెబిౖల్ చెప్పిందే సత్యం!
నువ్వన్నది ఋజువే చూపిస్తే ఏ పోటీకైనా సిద్ధం
1. ఎదురే లేదు, బైబిల్ తప్పే కాదు, దేవుడు రాసిన దీ గ్రంథమే
బైబిల్ కెదురే లేదు, బైబిల్ తప్పే కాదు, దేవుడు రాసినదీ గ్రంథమే
రేపేమి సంభవిస్తుందో నీకు చేతనైతే చెప్పు
భవిష్యత్ జ్ఞానివి నీవైతే నాకేమి జరుగునో చెప్పు
బైబిల్ చెప్పని భవిష్యత్ ఎవడైనా చెబితే తప్పు ||2012 కి||
2. యేసు వస్తే యుగాంతం – విశ్వమంతా వినాశనం
తండ్రికే తెలుసు ఆ దినం – దేవుడెవరికీ చెప్పలేదు ||2||
మనిషి ఊహించి చెప్పిన మాటకు ఋజువు చూపించగలడా ?
సృష్టికర్త వ్రాయించిన గ్రంథం మనిషి ఎదిరించగలడా ?
నీ అంతం తెలియని నీకు – యుగాంతం తెలుసా నీకు!
యుద్ధం చేసేది మేమే, సత్యం చెప్పేది మేమే,
విశ్వం గూర్చి చెప్పిన గ్రంథమిదే..
నువ్వు చెప్పింది జరుగక పోతే బైబిల్ చెప్పిందే సత్యం!
నువ్వన్నది ఋజువే చూపిస్తే ఏ పోటీకైనా సిద్ధం ||తెల్లని గుఱ్ఱము||
Tellani Gurramulekki Song Lyrics in English