తరతరముల నుండి | Tarataramula Nundi

Songs Home Page       All Telugu Christian Songs       All BOUI Songs


తరతరముల నుండి నివాస స్ధలము నీవే మాకు దేవా
భూమి లోకములు పుట్టకముందే తండ్రిగా ఉన్న దేవా
జనన మరణము లేదు నీకే ఆది అంతము లేదు నీకే
భూమి లోకములు పుట్టకముందే నీలో ఉన్నాము
మనిషిని మంటికి మార్చుచున్నావు నీవు
నరులారా తిరిగి రండని పిలుచుచున్నావు నీవు
చావే వరమని, నిను చూసే భాగ్యమని, నీ సేవలో చావే వరము మాకే
తెలుసుకో మానవా నీ తండ్రిని చేరుకోవా (2) ||తరతరముల||

1. మరణమే ఎదురైనా ఏ రూపంలో అది ఉన్నా
నీ మరణ దినము వ్రాసింది దేవుడని ఎదురు చూడాలి నీవే (2)
తన భక్తుల మరణమే గొప్పదని తన దృష్టికే విలువ గలదని
మరణం చూడక బ్రతికే నరుడే లేడనీ
తెలుసుకో మానవా నీ తండ్రిని చేరుకోవా (2) ||తరతరముల||

2. ఎందరో భక్తులున్నా పరదైసుకే చేరుకున్నా
పరలోకమందరం కలిసి రావాలనే వ్రాసాడా దేవుడు
ఎందరో భక్తులున్నా పరదైసుకే చేరుకున్నా
పరలోకమందరం కలిసి రావాలనే ఉంచాడా దేవుడు
ఈ లోకమే మనకు యాత్రని పరలోకమే మన నివాసమని
దేవుని సేవలో మరణిస్తే విశ్రాంతని
తెలుసుకో మానవా నీ తండ్రిని చేరుకోవా
తెలుసుకో మానవా తండ్రి ఆశను నీవు తీర్చిపోవా
తరతరముల నుండి నివాస స్థలము దేవుడని తెలుసుకోవా..


Tarataramula Nundi Song Lyrics in English

Scroll to Top