Songs Home Page All Telugu Christian Songs All BOUI Songs
తండ్రి బాధను తెలుసుకొనే వారెవరున్నారు
తండ్రి మనసును తెలుసుకొనే వారెవరున్నారు (2)
ఎవరెళతారు ఎవరెళతారు తన పిల్లలను రక్షించుటకు
ఎవరెళతారు (2)
తండ్రి బాధను కళ్ళారా చూసిన క్రీస్తే బలియైనాడు
తండ్రి తనయుడేసే బలియైనాడు, బలియైనాడు ||తండ్రి బాధను||
1. పశువులకు యజమాని ఎవరో తెలుసును
మనుషులకు దేవుడెవరో తెలుసునా! (2)
దేవుడు బ్రతుకును ఇచ్చాడు మనిషి బ్రతకడం నేర్చాడు (2)
తన తండ్రి ఎరుగని నరులే మూర్ఖులు…
విూ కంటే ఈ భూమిపై ఎవరున్నారు
తన పిల్లలను కాపాడే పనిలో మనుషులు ఎవరున్నారు
తండ్రి తనయుడేసే బలియైనాడు, బలియైనాడు ||తండ్రి బాధను||
2. నీ జననం నీ మరణం ఒంటరి తనమే
నీ బ్రతుకు ముగియుటకు చాలును ఒకే ఒక్క క్షణమే
చనిపోతే నీవారే నీతో రారు సాగనంపుతారు నీ కన్నవారు
దేవునికేమో అన్యాయం చేసావు అందరి కోసం అన్నీ సమకూర్చావు
నీవన్నీ వారికి, నీవేమో కాటికి ||తండ్రి బాధను||
Tandri Badhanu Telusukone Song Lyrics in English