Songs Home Page All Telugu Christian Songs All BOUI Songs
తల్లిని తండ్రిని అన్నా చెల్లిని నీ కోసం ఆ దేవుడే ఇచ్చాడు చూసావా?
తల్లిగ తండ్రిగ అన్నగ చెల్లిగ ప్రేమను పంచాలనే ఇచ్చాడు ఇది తెలుసా?
తల్లిలో ప్రేమను ఉంచాడు అది తల్లిది కాదు అది
తండ్రిలో ప్రేమను ఉంచాడు
తల్లి తండ్రి అన్నా చెల్లి చూపిన ప్రేమలన్ని తనవే
ప్రేమను చూపాడు ఇలా.. అది చెప్పకపోతే ఎలా? (2)
||తల్లిని తండ్రిని||
1. సృష్టినే కలిగించాడు ఆహారం వడ్డించాడు
తల్లిలాగ మూత పెట్టి ఆహారం దాచాడు (2)
ఎండ నీకు తగులకుండా మేఘమే ఇచ్చాడు
నీవు నిదుర పోవాలనే రాత్రినే ఇచ్చాడు
ఇంత మంచి దేవుని తెలుసుకున్నావా?
తన ప్రేమనే చూపినా నీ ప్రేమ చూపించవా (2)
ప్రేమను చూపాడు ఇలా.. అది చెప్పకపోతే ఎలా?
ప్రేమను చూపాడు ఇలా.. చెప్పకపోతే ఎలా ? ||తల్లిని తండ్రిని||
2. అమ్మ ప్రేమ నీకిచ్చాడు అమ్మ అని పిలిపించాడు
తల్లి తండ్రి ప్రేమను పొందమనే ఇచ్చాడు (2)
తల్లి తండ్రి ప్రేమను చూసి దైవ ప్రేమ మరిచావా?
బంధాలను ప్రేమించి నీవు దేవున్నే విడిచావా?
ఇంత మంచి దేవుని మరచి పోయావా?
ఏ తల్లి తండ్రి నేర్పించెనా.. ఏ బడిలోనే ఇది చెప్పెనా? (2)
ప్రేమను చూపాడు ఇలా.. అది చెప్పకపోతే ఎలా? (2)
ప్రేమను చూపాడు ఇలా.. చెప్పకపోతే ఎలా? ||తల్లిని తండ్రిని||
Tallini Tandrini Anna Chellini Song Lyrics in English