Songs Home Page All Telugu Christian Songs All BOUI Songs
సామాన్యుని నుండి శాస్త్రవేత్త వరకు
తప్పించుకొననిదే మరణం
ఏనాటికైనా ఈ మానవునికి
‘దేవాది దేవుడే శరణం’ (2) ||సామాన్యుని||
1. వచ్చావు నీవు ఈ లోకానికి
వెళతావు నీవు మరో లోకానికి (2)
మరణంతో ముడిపడిరది ప్రయాణం (2)
నిను పుట్టించిన దేవుడే నీ గమ్యస్థానం ||సామాన్యుని||
2. ఏ దేశం నుండి నీవొచ్చావో
ఆ దేశం నీవు తిరిగి చేరుకో (2)
దేవునికై బ్రతకాలని నిన్ను పంపితే (2)
తిరిగిరాని నరకానికి తరలిపోతున్నావా ||సామాన్యుని||
Samanyuni Nundi Song Lyrics in English