Songs Home Page All Telugu Christian Songs All BOUI Songs
సకల శాస్త్రాలనూ
అధిగమించిన నీ వాక్యమే (2)
జ్ఞానము శక్తియు క్రీస్తునందున్నవి (2) ||సకల||
1. ఆదియందు వాక్యము
వాక్యమే ఆ దైవము (2)
జీవము వెలుగును
యేసునందున్నవి (2) ||సకల||
2. కలిగియున్నది ఏదియు
యేసు లేకుండా కలుగలేదు (2)
జగతిలోని జీవరాశులన్
యేసు మాటలే కలిగించెను (2) ||సకల||
3. నీవు విత్తిన గింజకూ
దేహమిచ్చిన దాయనే (2)
మృతులను సజీవులుగా
చేయువాడు ఆ దైవమే (2) ||సకల||
Sakala Sastralanu