Songs Home Page All Telugu Christian Songs All BOUI Songs
పరమందు ఉన్న ఆ తండ్రి మనసు తెలిపాడు నీకు యేసే
ఆ తండ్రి మదిలో ఈ జగతికంటె ముందు న్న మనిషి నీవే
తనకు పిల్లలే కావాలనీ….తన యొద్దకే రావాలనీ…
నువు మాత్రమే చెప్పాలనీ… నీవు యేసుగా మారాలనీ… ||పరమందు||
1. యేసు చూపాడుగా ఆ తండ్రి రూపం
నీ బ్రతుకు చూపాలిగా ఆ యేసు రూపం
పరమందు నీ తండ్రి పవిత్రం – యేసు రక్తంతో నువ్వు పవిత్రం
మరియ గర్భాన మనిషిగా పుట్టి యేసు మారాడు దైవంగా
వాక్య మును బట్టి మనము ఎదగాలి క్రీస్తు మ్గాంంలో దేవునిగా
వాక్యమెవ్వరికి వచ్చెనో వారు మాత్రమే దైవమని
వాక్యన్ని ఎవరు నేర్పింతురో తండ్రి ప్రేముందనీ…
తెలుసుకో… నేర్చుకో… ||పరమందు||
2. నీ బాల్య దినములందే స్మరియించు దేవునిని
దుర్థినము రాకముందే ముగియించు తన పనిని
నీ పిల్లలకు నేర్పు వాక్యాన్ని దేవునికివ్వు గర్భఫలాన్ని
ఇవ్వవలసింది ఆస్తి కాదు అని వాక్యమని తెలుసుకోవాలి
ఇదే క్రైస్తవుని పనని తెలుసుకొని ఇలా బ్రతికి మరణించాలి
మనుషులంతా చెయ్యాలిదీ దేవుడిచ్చిన విధి
తనకివ్వబడిన పని పూర్తిచేసి చేరాలి తన సన్నిధి
తెలుసుకో… నడుచుకో… ||పరమందు||
Paramandu Unna Aa Tandri Manasue Song Lyrics in English
Discover more from SUTotal
Subscribe to get the latest posts sent to your email.