Songs Home Page All Telugu Christian Songs All BOUI Songs
పరలోకపు తండ్రి పిల్లలం మేము భూమి మీద గొప్ప జ్ఞానులం (2)
మాకెదురు లేదు మా ముందు నిలువలేరు – ఏ ఒక్కరు
ఏ విషయమైన ఎంత జ్ఞానమైన తెలుపుతాము మేము (2)
సృష్టికర్త గూర్చి తెలుసునా, సృష్టి చేసినది ఎవరో తెలుసునా?
ఆ సృష్టికర్త గూర్చి తెలిపే దైవజ్ఞానులం ||పరలోకపు తండ్రి||
1. నీ కన్నులెత్తి పైకి చూడు
ఈ విశ్వమంతా చేసినది ఎవరో చెప్పు?
నీకు తెలియదంటే నన్నడిగి చూడు
ఆ సృషికర్త పేరు తెలుపుతాము మేము (2)
బిగ్‌బేంగ్ వలన సృష్టి పుట్టెనా?
ఆ శబ్ధమెవరో నీకు తెలుసునా?
ఆ శబ్ధమే యేసుక్రీస్తని బైబిలేపుడో ముందే తెలిపెను (2)
ఆ సృష్టికర్త గూర్చి తెలిపే దైవజ్ఞానులం ||పరలోకపు తండ్రి||
2. ప్రతి విత్తనాన్ని ఒకసారి చూడు
అది చచ్చితేనే మొక్కగా తిరిగి రాదు
ఆ మొక్క కంటే మనిషి గొప్పవాడు
మరణించినాక మనిషి మరల బ్రతుకుతాడు (2)
మరణిస్తే బ్రతుకు ఉంది తెలుసునా?
అది తెలిపినది యేసు తెలుసునా?
శాస్త్రవేత్తలే చెప్పలేనిది బైబిలెపుడో ముందే తెలిపెను (2)
ఆ సృష్టికర్త గూర్చి తెలిపే దైవజ్ఞానులం ||పరలోకపు తండ్రి||
Paralokapu Tandri Pillalam Song Lyrics in English