Songs Home Page All Telugu Christian Songs All BOUI Songs
నింగి, నేల, నీరు, నిప్పు, గాలీ (2)
ఇవి చేసిందెవరో తెలుసునా? నీకిచ్చిందెవరో తెలుసునా?
నీ ఆకలి తీర్చే ఆహారాన్ని చేసింది ఎవరని
నువ్వు పుట్టకముందే చేసాడు అన్ని ఇచ్చాడు నీకనీ
నీవెవరివో తెలుసా? ఓ మనిషి.. నీ వెవరివో తెలుసా? ||నింగి, నేల||
1. కన్ను, ముక్కు, కాళ్ళు, చేతులు నీకెవరిచ్చారు?
నీవు పుట్టకముందే తల్లిరొమ్ములో పాలెవరు పెట్టారు? (2)
నీ ఆకలి తీర్చే ఆ దేవుడెవరని, ఎపుడైనా తల్లిదండ్రిని నువ్వడిగావా? (2)
పీల్చే గాలి, త్రాగే నీరు ఎవరిచ్చారు? ||నింగి, నేల||
2. పండు, కాయకు రుచిని పెట్టి నీకెవరిచ్చారు?
నువు పుట్టకముందె చెట్టు చెట్టుకి కాయెవరు పెట్టారు (2)
నీ కోరిక తీర్చె అతనెవరో కాదనీ
నీ తల్లిదండ్రులకే తండ్రని నువు మరిచావా? (2)
పీల్చే గాలి, త్రాగే నీరు అతనిచ్చాడు ||నింగి, నేల||
Ningi Nela Neeru Nippu Gaali Song Lyrics in English