నిజమా నిజమా | Nijama Nijama

Songs Home Page       All Telugu Christian Songs       All BOUI Songs


నిజమా నిజమా అపవాదే చెప్పిన మాటే ఇది నిజమా (2)
మోసపోకు హవ్వలా… భార్యమాటే వినకలా…
అపవాది ఉందిలా… మనిషికేస్తోంది అది వల
ఇది తెలుసా… ఇది తెలుసా…
అపవాది తంత్రమే నీకు తెలుసా? ||నిజమా||

1. యేసుక్రీస్తునే అది వదలలేదుగా అది
లోకమంతా క్షణములోనే చూపినాదది (2)
ప్రతి మనిషిని మోసం చేయుటకే అది చూస్తుంది
ఆ దేవుని నుండే మనిషిని దూరం చూస్తుంది
గర్జించు సింహము వలె ఎందరినో మ్రింగివేసింది ||నిజమా||

2. క్రీస్తు సంఘమే అది వదలలేదుగా అది
రక్తమిచ్చి కొన్న సంఘం చీల్చినాదది (2)
ప్రతి మనిషిని మోసం చేయుటకే అది చూస్తుంది
ఆ దేవుని నుండే మనిషిని దూరం చూస్తుంది
పెంతెకొస్తు ఇది నిజమా? బాప్టిస్టే ఇది నిజమా?
లూధరన్‌ ఇది నిజమా? ఈ సంఘాలన్ని నిజమా?
ఏది నిజం? క్రీస్తు సంఘమే సత్యం (2)
నిజమా నిజమా ఈ సంఘాలనుకున్న పేర్లన్ని నిజమా? ఇది నిజమా? (2)
మోసపోకు హవ్వలా… దొంగ బోధే వినకలా…
అపవాది ఉందిలా… మనిషికేస్తోంది అది వల
ఇది తెలుసా… ఇది తెలుసా…అపవాది తంత్రమే నీకు తెలుసా?
నిజమా నిజమా ఈ సంఘాలకున్న పేర్లన్ని నిజమా? ఇది నిజమా?


Nijama Nijama Song Lyrics in English

Scroll to Top