నీవెవరైనా కాని ఈ లోకానికే
ఎందుకొచ్చావో అది తెలుసునా ?
చదువెంతున్నాగాని నీ జన్మెందుకో
దాని పరమార్ధమే తెలుసునా ?
భూమి మీద ఎన్నిటినో పరిశీలించావురా!
నీ జన్మ కొరకు ఎప్పుడైనా యోచించావా?
ఈగ జీవితం, దోమ జీవితం
ఎన్నెన్ని కష్టాలు పడి నీవు చదివావురా (2) ||నీవెవరైనా||
1. బి.ఎ. యం.ఎ. డిగ్రీలెన్నో చదివినా
బ్రతుకిచ్చిందెవరో ఏనాడైనా తెలుసునా?
పుస్తకాలలో లేదది యూనివర్సిటీలలో లేదది
బ్రతుకిచ్చిన ఆ దేవుడే వ్రాసి ఉంచాడు నీకది (2)
ప్రపంచంలో ముద్రించిన గ్రంధం బైబిలే మొదటిది
మొదటి మానవుని పుటుక్ట నుండే వ్రాసాడు నీకది
ఈ చరిత్రున్న పుస్తకముంటే చూపించు నాకది ||నీవెవరైనా||
2. బ్రతకాలంటే బడిలో చదువుటకాదురా?
ఏ బడిలో చదవని జంతువు బ్రతుకుట లేదురా?
పుస్తకం చదువలేదురా ఉద్యోగమే చెయ్యలేదురా
నీకోసం బ్రతకాలని బ్రతుకెందుకో తనకు తెలుసురా (2)
భూమి మీద ఉన్నవి అన్ని నీకని తెలుసది
నీవు బ్రతకాలి దేవుని కొరకని తెలుసా నీకిది
ఏ పాఠశాలలో చెప్పని దేవుని పాఠం నీకిది ||నీవెవరైనా||
Neevevaraina Kani Song Lyrics in English