నీ తండ్రి పని | Nee Tandri Pani

Songs Home Page       All Telugu Christian Songs       All BOUI Songs


నీ తండ్రి పని నీ కుందని మరచిపోకుమా
ప్రార్ధించి పని మరచి నిదురపోకుమా ? (2)
నీ తండ్రి పని విూదే ఉండాలని
నీ తండ్రి కోరికలన్నీ తీర్చాలని
ధనవంతుడు చేసిన నేరం మరిచావా ? ||నీ తండ్రి పని||

1. జననం మరణం మధ్యన ఉన్నది జీవిత కాలం
జననం మరణం మధ్యన ఉన్నది పని కాలం
పనిచేసి పరలోకం స్వతంత్రించుకో
పనిలో నీ కోరికలన్నీ నియంత్రించుకో
దేవుని సంకల్పం చొప్పునే
సేవచేసి నిద్రించాలి ||నీ తండ్రి పని||

2. జననం మరణం మధ్యన ఉన్నది మనుషుల బంధం
మరణంతో తెగిపోతుంది మనిషి సంబంధం
దేవుడు నీకిచ్చిన పనిని పూర్తి చేసుకో
క్రీస్తువలె ఆత్మను తండ్రికి అప్పగించుకో
దేవుని సంకల్పం చొప్పునే
సేవ చేసి నిద్రించాలి ||నీ తండ్రి పని||


Nee Tandri Pani Song Lyrics in English

Scroll to Top