Songs Home Page All Telugu Christian Songs All BOUI Songs
నీ రాకకై ఎదురుచూసే ఆ దేవుడున్నాడనీ
ఆ తండ్రి పని నీవుచేసి మరణించి వెళ్లాలనీ
నీ కోసమే ఉన్నాడనీ ఈ సృష్టంతా చేసాడనీ
తన కోసమే బ్రతకాలనీ దేవుడే నిన్నుకన్నాడనీ ||నీ రాకకై||
1. తన రూపమే నీకు ఇచ్చి ఈ భువికి పంపాడనీ
తన మహిమకే కీర్తి తెచ్చి ఈ భువిలో చాటాలనీ
నువ్వు చేయాల్సిన పని వ్రాయించెను నువు పుటకముందే పనిపుట్టెను (2)
ఆ తండ్రి పని నీవు చేయాలని ఈ తనువుతో పూర్తి చేయాలని
ఈ జీవగ్రంథంలో వ్రాయించెను ||నీ రాకకై||
2. అపొస్తలలు శ్రమలనుభవించి పని పూర్తిచేసారనీ
అదే బాటలో నీవు నడచి నీపనిని చెయ్యాలనీ
పనిచేయు వారికే పరలోకము సహకారమందిస్తే అవకాశము (2)
నీవంతుపని నువ్వే చేయాలనీ ఈ తనవుతో పూర్తి చేయాలని
ఈ తరములో నిన్ను పుట్టించెను ||నీ రాకకై||
Nee Rakakai Eduruchuse Song Lyrics in English