మరణించినవారే ప్రేతాత్మలుగా వస్తారా | Maraninchinavare Pretatmaluga Vastara

Songs Home Page       All Telugu Christian Songs       All BOUI Songs


మరణించినవారే ప్రేతాత్మలుగా వస్తారా?
మరణించిన క్షణమే ప్రేతాత్మలై తిరుగుతారా?
దయ్యాలే ఉన్నాయా ? అవి మనుష్యులపై పడతాయా?
కాలం చెల్లకపోతే స్మశానంలో ఉంటాయా?
కోరికే తీరలేదని అవి మనిషినావహిస్తాయనీ
చిల్లంగి చేతబడులతో దయ్యాన్ని వదలగొడతామని
మోసం చేసే వారే ఉన్నారు చనిపోయినవారే దయ్యాలుగ మరి రారు
||మరణించిన వారే||

1. చనిపోయినవారే ఎందరో ఆత్మలుగా ఉన్నారు
శత్రువుపై పగ సాధిస్తే అందరిని చంపేస్తారు (2)
బిన్‌లాడెన్‌ చనిపోలేదా? సద్దాం చనిపోలేదా?
వీరప్పన్‌ చనిపోలేదా? వీరందరిని చంపేయలేదా?
బ్రతికున్నప్పుడే ఎందరినో చంపారు
చనిపోయిన వీరే ఎందుకు మరి రాలేదు?
ప్రేతాత్మలు ఎవరు రారు ఆ దేవుడు ఊరుకోడు ||మరణించిన వారే||

(భూతం, ప్రేతం, కామపిశాచి ప్రేతాత్మలను భందిస్తావా? ఆ బంధిస్తాను
సాకిని, డాగిని, కామిని, మోహిని ప్రేతాత్మలను రప్పిస్తావా? ఆ రప్పిస్తాను
సద్దాం, బిన్‌లాడెన్‌ రప్పిస్తావా? ఆ రప్పిస్తాను
వీరప్పన్‌, ప్రభాకరన్ పిల్లైను రప్పిస్తావా? ఆ రప్పిస్తాను
చేతబడి, బాణామతి, చిల్లంగిలతో ఎవ్వరినైనా చంపగలవా? చంపగలను
అయితే నాయకులను చంపగలవా? ఆ చంపగలను
మంత్రులను చంపగలవా? ఆ చంపగలను చంపగలవా..? ఆ..!
మంత్రాలకు చింతకాయలే రాలనప్పుడు
మంత్రాలతో మంత్రులు రాలిపోతారా? ఆ..
స్మశానంలో బొమ్మకు చిల్లంగి పెడితే ఎక్కడో ఉన్న మనిషి చస్తాడా ?
ఇదేమైనా రిమోట్‌ కంట్రోలరా?
నువు ఇక్కడ నుండి ఆపరేట్‌ చేయడానికి,
చెప్పు! నన్ను ముట్టుకోకుండ నాపై చేతబడి చేయగలవా
చెప్పు! లక్షరూపాయలు ఇస్తాను నన్ను ముట్టుకోకుండ నాపై చిల్లంగి చేయగలవా
చెప్పు! పది లక్షలరూపాయలు ఇస్తాను
కావాలంటే నా రక్తం ఇస్తాను, నా వెంట్రుకలు ఇస్తాను
చెప్పు! నన్ను ముట్టుకోకుండ నాపై బాణామతి చేయగలవా
చెప్పు! కోటిరూపాయలు ఇస్తాను!
అయ్యా అయ్యా అయ్యా! నాలో ఏ మంత్రాలు మాయలు లేవు
నిజంగా నా దగ్గర ఆ శక్తులే ఉంటే ఈ స్మశానంలో నేనెందుకు
ఇలాంటి బ్రతుకు బ్రతుకుతాను
అయ్యా, ఆ శక్తులే ఉంటే కోటిశ్వరులను చంపి,
నేనూ కోటిశ్వరున్ని అయ్యిపోతాను కదయ్యా
ప్రజలను సినిమాలు సీరియల్లు చూసి నమ్ముతుంటే
వాళ్ల బలహీనతలను అడ్డుపెట్టుకొని ఈ బ్రతుకు బ్రతుకుతానాన్నయ్యా
నిజంగా నాకు ఏ మంత్రాలు మాయలు లేవు, రావు కూడా
క్షమించండయ్యా, నాలో మంత్రాలు మాయలు లేవని మీకు ఎలా తెలుసు ?
ఇంతకు మీరెవరూ..
నేను క్రీస్తును నమ్మిన క్రైస్తవుడను, దేవుని కుమారుడను! మీరా?
||మరణించిన వారే||

2. కనిపించని ఆత్మను ఎవ్వరు ఈ కళ్ళతో చూడరు ఎన్నడు
కనిపించని ఆత్మకు ఉండవు కనిపించే మాంసం ఎముకలు
కనిపించని ఆత్మలు ఎవ్వరు చీకటిలో చూడరు ఎన్నడు
కనిపించని ఆత్మకు ఉండవు కనిపించే మాంసం ఎముకలు
పగపట్టి పీడించదాత్మెపుడు నిను ఆవహించదు ఆత్మెపుడు
పగతీర్చుకొనవు ఆత్మలు ఎపుడు పరకాయ ప్రవేశం లేదెపుడు
దేహం విడిచిన ఆత్మెలుతుందీ క్షణము
ఆ ఆత్మను వదలడు దేవుడు మరుక్షణము
సినిమాలే నిజమే కాదు దర్శకుడే పిచ్చివాడు ||మరణించిన వారే||


Maraninchinavare Pretatmaluga Vastara Song Lyrics in English

Scroll to Top