మరణాన్ని గెలిచి మృతి నుండి లేచి | Marananni Gelichi Mruti Nundi Lechi

Songs Home Page       All Telugu Christian Songs       All BOUI Songs


మరణాన్ని గెలిచి మృతి నుండి లేచి
సాతానుపైన విజయాన్ని పొందిన
క్రీస్తేసే జయశాలిరా
పాపములేని ఆయనలోనె పాపముందని చూపించేవారె
ఆనాడెవరూ లేరురా..
యేసే పవిత్రుడని ప్రకటిస్తాము
దేవుని కుమారుడని ఒప్పిస్తాము
పాపం లేదని రుజువె చూపిస్తాము
మరణించి లేచాడని ప్రకటిస్తాము
క్రీస్తేసే జయశాలి
క్రీస్తును ధరియించిన ప్రతివాడు జయశాలిరా
||మరణాన్ని||

1. కన్యకయందు పుట్టిన శకపురుషుడు క్రీస్తే
యూదుల రాజుగ పుట్టిన మెస్సయ్య క్రీస్తే
మనుషులు చేసే పాపానికి రక్తాన్నిచ్చింది క్రీస్తే
శిలువపైన మరణించి ముందుగానే ప్రకటించి
మృత్యువును జయించినాడురా
మనుషులంతా ఒకటేనని
పరమ తండ్రి తనయులు అని
తండ్రి గూర్చి తెలిపినాడురా
బ్రతుకుకు బలికావాలి బ్రతుకుటకు చావాలి
క్రీస్తేసే బలి కావాలి
నిత్యజీవానికి క్రీస్తే బలికావాలిరా ||మరణాన్ని||

2. మనుష్యులు బ్రతకాలంటే జీవం కావాలి
ప్రకృతి అందుకు మనకై బలియైపోవాలి
ఈ జీవానికే ప్రాణం ఉండే జీవులు బలికావాలిరా
జీవహింస పాపమని జంతుబలిని ఆపమని
జంతువులను తినుట లేదా?
కోడ మేక మాంసమని ఆకు కూరగాయలని
కోసుకొని తినుట లేదా?
బ్రతుకుకు బలికావాలి బ్రతుకుటకు చావాలి
క్రీస్తేసే బలి కావాలి
నిత్యజీవానికి క్రీస్తే బలికావాలిరా ||మరణాన్ని||


Marananni Gelichi Mruti Nundi Lechi Song Lyrics in English

Scroll to Top