Songs Home Page All Telugu Christian Songs All BOUI Songs
మనిషికి జన్మపాపమున్నదా?
మనిషికి కర్మపాపమున్నదా? (2)
పాపములో పుట్టావా ? పాపముతో పుట్టావా ? (2)
గమనించు సోదరా నీ జన్మే పాపమా ? (2)
దేవుడు నరులను యదార్ధవంతులుగా పుట్టించెను (2) ||మనిషికి||
1. వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను?
వీడా ? వీన్ని కన్నవారా ? (2)
వీడైనా వీణ్ని కన్నవారైనా పాపము చేయలేదు (2)
దేవుడు నరులను యదార్ధవంతులుగా పుట్టించెను (2) ||మనిషికి||
2. ఆది దంపతుల పాపానికి మరణమందరికి వచ్చెను
లోకములో పాపము ప్రవేశించెను (2)
పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను
నాలో పాపము లేదు (2)
దేవుడు నరులను యదార్ధవంతులుగా పుట్టించెను (2) ||మనిషికి||
Manishiki Janmapapamunnada Song Lyrics in English