Songs Home Page All Telugu Christian Songs All BOUI Songs
మనిషి జన్మకే విలువ తెలియక
ఆత్మహత్య చేసుకొనే ఈ లోకం
బ్రతుకులో సుఖం దొరకలేదనీ
మరణమే ముగింపనుకొనె ఈ లోకం
జంతువులకు లేదీ మనసు బ్రతుకెందుకొ వాటికి తెలుసు
నీ కొరకే బలియౌవ్వాలనీ…
మనిషికి మరణం ముగింపు కాదని తెలుసా?
ఆత్మకే చావులేదనీ నీకు తెలుసా? (2) ||మనిషి జన్మకే||
1. దేవుని ఆత్మను కలిగిన మనిషివి నీవే
ఆది అంతము లేని ఆత్మయే ఉన్నది నీకే (2)
ఆ దేవుడే నీకిచ్చెను తనలోని భాగాన్ని పంచెను
తన కోసమే బ్రతుకుతావనీ
నిను నమ్మి ఈ బ్రతుకు ఇచ్చెను
బ్రతుకెందుకో గుర్తించక చనిపోవుటే న్యాయమా? ||మనిషి జన్మకే||
2. ఆత్మ లేని ఏ దేహమైన అది శవమే
ఆత్మ ఉంటేనే అందరికీ అది అవసరమే (2)
నీ మరణదినము రాసాడనీ ఆ దినము వరకు బ్రతకాలని
తన ఆశ తీర్చి వస్తావని తన కొరకు చెబుతావు నీవని
బ్రతుకిచ్చిన ఆ దేవుని నువు మరచుటే న్యాయమా ? ||మనిషి జన్మకే||
3. ఇస్కరి యోతు యూదా చేసిన ఘోరం
తనకు తాను ఉరిపెట్టుకొనుటయే చేసిన నేరం (2)
చేసాడు అతడు అన్యాయము చేరింది ఆత్మ ‘పాతాళము’
కాలాలి ఆత్మ కలకాలము తన ఆత్మకే లేదు ‘మరణము’
మనిషి చేసినా నేరానికి శిక్షించుటే న్యాయమా…
ఇది దేవునికి న్యాయమే ||మనిషి జన్మకే||
Manishi Janmake Viluva Teliyaka Song Lyrics in English