Songs Home Page All Telugu Christian Songs All BOUI Songs
మానవుడా కారణాజన్ముడా
నీ జన్మకు కారణముంది (2)
అర్ధం తెలియక నీవూ
వ్యర్దంగా బ్రతకకు (2)
పరమార్ధమున్నదని
ప్రభుకొరకే బ్రతకమని (2) ||మానవుడా||
1. పువ్వులెందుకు? కాయలెందుకు?
ఋతువులెందుకు? కాలాలెందుకు? (2)
ఉన్నవన్ని నీ కోసమేనని
నీవు దేవుని కోసమేనని (2)
గమనించి తెలుసుకో
గ్రహియించి మసలుకో (2) ||మానవుడా||
2. సూర్యుడెందుకు? చంద్రుడెందుకు?
రాత్రులెందుకు ? పగలు ఎందుకు? (2)
రాత్రి పగలు దేవుడే చేసేనని
ఆ దేవుని పని నీవు చేయాలని (2)
ప్రభువును ప్రకటించి పాపిని రక్షించి (2)
పరలోకం చేర్చాలానీ (2) ||మానవుడా||
Manavuda Karanajanmuda