Songs Home Page All Telugu Christian Songs All BOUI Songs
మానవ బాంబులతో కారుబాంబులతో
మనిషిని చంపి
దేవుని సేవని చెప్పే కాలం వచ్చింది (2)
చెప్పాడు ముందే యేసు
జరుగుతున్నాయి మీమద్య నేడు (2)
చావు చంపెయ్ అడ్డొస్తే కాల్చేయ్
ఉగ్రవాదులదే ఈ నినాదం
ప్రాణం తీసేయ్ గురిచూసి కాల్చేయ్
నరహంతకులదె మారణహోమం ||మానవ బాంబులతో||
1. మనిషిని బ్రతికించలేని నీవు
చంపే అధికారం నీకుందా ?
చావుతో పోరాడుతున్న వానికి
రక్తం ఎపుడైనా ఇచ్చావా ?
ప్రాణం నిలబెట్టాలిరా ప్రాణం పోతే రానే రాదురా!
ప్రాణం నిలబెట్టాలిరా? ప్రాణం తీసే హక్కే లేదురా!
ప్రాణం పోస్తాడు మంచి వైద్యుడు
ప్రాణం ఇస్తాడు మంచి నాయకుడు
పగలతో రగులుతూ ఉద్యమాలతో ఉసిగొల్పీ…
నక్సలిజం నెతుర్తె ఫ్యాకన్షిజం ఉప్పెనై
టెర్రరిజం తీవ్రమై హతమార్చుతుంటే (2)
సాధించేదేముందిరా?
చంపి నేరం చేస్తున్నావురా!
అన్యాయం చేసావురా!
అందరి ప్రాణాలు తీసావురా!
అన్యాయం పేరుతో హంతకులుగ మారి
ఆత్యాహుతి దళంగా ప్రజల మధ్య పేలీ… ||మానవ బాంబులతో||
2. దేవుడు కలిగించిన ఈ సృష్టిని
నరులందరికీ పంచాడు
తన పిల్లలే ఈ సృష్టిని
రారాజులుగా ఏలమని చెప్పాడు
గాలి సమానం నీరు సమానం
సూర్యునినుండొచ్చే ఆ వేడి సమానం
సమానంగా పంచింది దేవుడే
ఎకరాలపంట దోచుకుంది స్వార్ధపరుడే
(( సృష్టిలోని జంతుపక్షి జలచరమున్నగు ఏ జాతిలో పుట్టని ముసలం
నరజాతిలో పుట్టడం దౌర్భాగ్యం – ఒకే మనిషి నుండి పుట్టుకొచ్చిన
మానవ జాతి తమ స్వజాతి నాశనాన్ని కోరుకోవడం విడ్డూరం
కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు అమెరికా నుండి అలస్కావరకు
పుట్టుకొచ్చిన మానవ జాతి మధ్య ఆసియా నుండి వచ్చినదే
ఆదిమానవుని జన్మస్థలం ఆసియా నుండే
ప్రపంచ ప్రజలందరూ చెదరిపోయింది అక్కడినుండే
ఒకే మానవ జాతి రక్తపు నాడికి అడ్డుకట్టలు వేసి
మాల, మాదిగ, కమ్మ, కాపు మున్నగు నాడులకు జన్మనిచ్చి
దేవుని కంట కన్నీరు రప్పించి))
మారణహోమం జరిపిస్తుంటే
ఎవరు ఆపుతారు ఈ ఘోరాన్ని
ఎవరు ఆపగలరు ఈ నేరాన్ని
ఇండియా, ఇజ్రాయెల్, అమెరికా, బాగ్ధాద్
ఏ దేశంలో చూసిన బాంబుల మోతే
ఇరాక్, ఇరాన్, జపాన్, లండన్
ఏ దేశంలో చూసినా రక్తపు ఘోషే
((ఎందుకు ఉగ్రవాదిగా మారిపోయావు?
ఎందుకు నక్సలైటుగా మారిపోయావు?
ఎందుకు మనిషీ మనిషిని చంపుతున్నావ్?
పుట్టినప్పుడిలా లేవే! నేరం చేసిన ప్రతి మనిషినీ చంపాలనుకుంటే
ప్రపంచంలో ప్రతిమనిషీ నేరస్తుడే
ఎంత మందిని చంపుతావ్? ఎంతమందిని ఉరితీస్తావ్?
మనిషిని చంపడానికేన దేవుడు నిన్ను పుట్టించిది ?
ఇంతేనా ఈ ప్రపంచం ఇదేనా ఈ ప్రపంచ భవిష్యత్తు
ఇంతటి దౌర్భాగ్యపు దుస్థితి నుండి ఈ ప్రపంచాన్ని రక్షించే నాధుడు లేడా?
ఉంటే మన మధ్యకు రాడా? వస్తే ఎలా ఉంటాడు?))
మనిషిని మార్చే మాటలు చెప్పే ప్రేమామయుడు
పాపులకోసం ప్రాణం పెట్టే కరుణామయుడు
మనుషులంతా ఒక్కటనీ…
పరమ తండ్రీ పుత్రులనీ…
కులమతాలు లేవని చెప్పాడూ…
విత్తనం చచ్చి బ్రతుకుతుంది
నీ ఆత్మకే మరో బ్రతుకు ఉంది
చనిపోతే మరో బ్రతుకు ఉంది
ఆ బ్రతుకెందుకో బైబిల్ చెబుతుందీ…
బ్రతుకు బ్రతికించు బ్రతుకుందని బోధించు
క్రీస్తు యేసుదే ఈ నినాదం (2)
((కత్తి పట్టుకున్నవాడు కత్తితో చంపబడతాడు
బాంబు పట్టుకున్నవాడు బాంబుతో పేలిపోతాడు
తుపాకి పట్టుకున్నవాడు తుపాకితో కాల్చబడతాడు
యేసు పట్టుకున్నది ప్రేమతత్వం
అందుకే ఆయన విప్లవం ఆరిపోలేదు
ఆయన విప్లవం కూలిపోలేదు
మనిషిని మార్చాలంటే చూపించవలసింది
నేరాలు ఘోరాలు కాదు
పసితనంలో నేర్పించవలసింది ప్రభుయేసుని పాఠాలు
ఈ లోకం ఉందని తెలియాలంటే పుట్టాలి
మరో లోకముందని తెలియాలంటే మరణించాలి
దేవుని పేరు చెప్పి మనిషిని చంపుతావో
ఆ దేవుని ప్రేమని చెప్పి మనిషిని బ్రతికిస్తావో ? నీవే నిర్ణయించుకో))
Manava Bambulato Song Lyrics in English