క్రీస్తును కన్నందుకు | Kreestunu Kannanduku

Songs Home Page       All Telugu Christian Songs       All BOUI Songs


క్రీస్తును కన్నందుకు కన్నీరేనా కలిగెన మరియకు
ఆ కీస్తును ధరియించిన నీ జీవితమే శోకమే చివరకు
కష్టాలు కన్నీల్లే కలిగేనా యేసుకు
నీ కోసమే బలియై వ్రేలాడేనా సిలువకు
ఈ కష్టం నీ కోసం కలిగేనా ప్రభువుకు
||క్రీస్తును కన్నందుకు||

1. ఆ యేసు గర్భాన పడినిప్పుడే కష్టాలు ఆ మరియకు
ఆ మాట తన భర్త వినినప్పుడే అనుమానమే భర్తకు
భర్తే అనుమనించి విడనాడుద్థేశిస్తే
నీ భార్య మంచిదని దేవుడే కబురంపెను
లోక రక్షకుడనెరిగి రక్షిస్తాడని తెలిసి
క్రీస్తునే కన్న తరువాతే కాపురం చేసెను
సిలువ యొద్దకే వెళ్లింది యేసును చూచుటకు
తన భర్త పిలల్లు రాలేదప్పుడు ఆమెతో ఎందుకు
ఆ ఘడియ నుండే ఆమెల్లి పోయింది యోహాను యొద్దకు
ఆ శిష్యునింటికే చేరిపోయింది తల్లిగా చివరకు ఒంటరిగా చివరకు
జరిగింది అన్యాయం ఎవరికి తెలుసీ సత్యం ||క్రీస్తును కన్నందుకు||

2. ఆ యేసును ప్రతి దినము ధరియించితే అవమానమే మరువకు
చావైతే లాభమని కొనసాగితే బహుమానమే చివరకు
నీవారే నిందించినా నీ భర్తే దూషించినా
దేవుని పని జరిగిస్తే ఆ యేసుకు తల్లివే
శ్రమలున్నా నువ్వు విడువకు మరియ వలె నిలుచు చివరకు ||క్రీస్తును కన్నందుకు||


Kreestunu Kannanduku Song Lyrics in English

Scroll to Top