క్రీస్తు విరోధులపై సింహగర్జన | Kreestu Virodhulapai Simhagarjana

Songs Home Page       All Telugu Christian Songs       All BOUI Songs


క్రీస్తు విరోధులపై సింహగర్జన
క్రైస్తవుడే చెయ్యాలి ప్రళయ గర్జన
అపవాది అనుచరులను పదిరించిన నాడు…
విజయంతో జయశాలై నిలిచిపోతాడు ||క్రీస్తు విరోధులపై||

1. క్రీస్తు సిలువ వేయబడలేదని
కాశ్మీరుకు తరలి వచ్చినాడని (2)
కారుకూత కూశాడు మతపిచ్చోడు
చేవ్రాతను వ్రాసాడు చరిత్రహీనుడు
లోకంలో ఎందరో మహత్ములున్ననూ
కాలాన్ని లెక్కించుటకు క్రీస్తే శకపురుషుడని
వాదించి ఒప్పించే క్రైస్తవుడున్నాడు
ఛాలెంజ్‌ విసిరితే ముందుకెవడు రాడు ||క్రీస్తు విరోధులపై||

2. బైబిలే మహాజ్ఞాన గ్రంథమని
మత పుసక్త మన్నావాడు మూర్ఖుడని (2)
ఎదిరించే వారితో తర్కించలేదా?
ప్రాణాలను ప్రభుకొరకు అర్పించలేదా?
చేవలేని క్రైస్తవ్యం నీ కెందుకు?
చావో రేవో తేల్చుకొనగ రా ముందుకు! ||క్రీస్తు విరోధులపై||


Kreestu Virodhulapai Simhagarjana Song Lyrics in English

Scroll to Top