Songs Home Page All Telugu Christian Songs All BOUI Songs
కూడు గూడు కోసం బ్రతకాలనుకుందీ లోకం
కూలినాలి చేసి గడపాలనుకుందీ లోకం
చనిపోతే బ్రతుకు లేదూ ప్రతిదినమూ సుఖపడితే చాలు
భవిష్యత్తే లేదని చస్తే నీకే చేటూ…
ఈ బ్రతుకు దేవునికిస్తే స్వర్గంలో ఉంది చోటూ ||కూడు గూడు||
1. నువ్వు కన్న పిల్లలకోసం కష్టమంతా ఇచ్చావు
నిన్ను కన్న దేవునికోసం నువ్వు ఏమి చేశావు (2)
సృష్టినంతా ఇచ్చీ పెట్టుబడి పెట్టి
పగలూ రాత్రులిచ్చీ భూమినంతా త్రిప్పీ
కాలన్ని రప్పించె దయగల దేవుడు ఉన్నాడనీ తెలుసుకోవా? ||కూడు గూడు||
2. జీవరాసులన్నీటి కంటే మంచి బ్రతుకు ఇచ్చాడు
మూగ జీవులన్నీటికంటే మంచి జ్ఞానమిచ్చాడు (2)
మాటనీకు ఇచ్చీ భాష నీకు ఇచ్చీ
మంచి చెడులు తెలిపే మనసు నీకే ఇచ్చి
జీవాన్ని దయచేసే దేవునికోసం బ్రతకాలనీ తెలుసుకోవా? ||కూడు గూడు||
Koodu Goodu Kosam Song Lyrics in English