Songs Home Page All Telugu Christian Songs All BOUI Songs
కట్టెలపై నీ శరీరం
కనిపించదు గంటకు మళ్ళీ
మట్టిలోన పెట్టిన నిన్నే
గుర్తించదు నీ తల్లి
ఎన్ని చేసిన తనువు నమ్మినా …
కట్టె మిగిల్చింది.. కన్నీటి గాధ… (2) || కట్టెలపై ||
1. దేవాది దేవుడే
తన పోలిక నీకిచ్చెను
తనఆశ నీలో చూసి
పరితపించిపోవాలని (2)
కన్న తండ్రినే మరచి
కాటికెళ్ళిపోతావా
నిత్యజీవం విడిచి
నరక మెళ్ళిపోతావా (2)
ఎన్ని చేసిన తనువు నమ్మినా …
కట్టె మిగిల్చింది.. కన్నీటి గాధ… (2) || కట్టెలపై ||
2. ఆత్మ నీలో ఉంటేనే
అందరు నిను ప్రేమిస్తారు
అది కాస్త వెళ్ళిపోతే
ఎవరికి నీ అవసరముండదు (2)
కన్నవారే ఉన్ననూ
కట్టుకున్నవారున్ననూ
ఎవ్వరికి కనిపించక నీ
ఆత్మ వెళ్ళి పోవును (2)
ఎన్ని చేసినా తనువు నమ్మినా
కట్టె మిగిల్చింది.. కన్నీటి గాధ… (2) || కట్టెలపై ||
Kattelapai Nee Sareeram
Discover more from SUTotal
Subscribe to get the latest posts sent to your email.