Songs Home Page All Telugu Christian Songs All BOUI Songs
కలిసి కట్టుగుండాలి వాక్యంతో కలిసుండాలి
క్రైస్తవులంతా భూమిని తలక్రిందులు చెయ్యాలి (2)
బైబిలు కలిగిన క్రైస్తవులు ఏకం కావాలి
యేసు చేసిన ప్రార్ధనకు న్యాయం చేయాలి (2)
బైబిల్ ఒక్కటే, బాప్తిస్మ మొక్కటే
దేవుడొక్కడే విశ్వాసం ఒక్కటే (2)
||కలిసి కట్టు||
1. బోధకులెందరు ఉన్నా బోధమాత్రం మారకూడదు
సంఘాలెన్ని ఉన్నా సత్యవాక్యం మార్చకూడదు
దేవుని ఆస్తుల కోసం పోరాటం మానండి
ఆత్మల రక్షణ కోసం ఐక్యంగా ఉండండి
ఆ సంఘమెత్తబడదంటూ ఈ సంఘమెత్తబడదంటూ
క్రీస్తుకొన్న ఈ సంఘాన్ని ముక్కలు చెయ్యొద్దు (2)
||బైబిలు కలిగిన||
2. అపొస్తలులు ఆరంభించింది ఆదిలోని ఈ సంఘం
అపవాది దాన్ని చీల్చింది నేడున్న క్రీస్తు సంఘం
వాక్య ప్రకారం జరిగించేదే నిజమైన క్రీస్తు సంఘం
బైబిలులో లేనిది చేసేదే అక్రమమైన సంఘం
పౌలువాడనని అంటూ సొంత గ్రూపులను అంటూ
వ్యక్తుల బట్టి సంఘాన్ని ముక్కలు చెయ్యొద్దు (2)
క్రీస్తు చెప్పిన మాటను బట్టి సంఘం చెయ్యాలి
ఆచారాలను ప్రక్కకు నెట్టి ఆరాధించాలి (2)
||బైబిలు కలిగిన||
Kalisi Kattugundali Song Lyrics in English