Songs Home Page All Telugu Christian Songs All BOUI Songs
జ్ఞాని ఎక్కడ? శాస్త్రి ఎక్కడ?
ఈ లోకపు తర్కవాది ఎక్కడ (2)
ప్రకృతి నుండి పుట్టిందే శాస్త్రం
సృష్టిని కలిగించింది దేవుని వాక్యం (2)
అడిగే వారికి వెదకే వారికి
ప్రకటించేవాడే క్రైస్తవుడే (2) ||జ్ఞాని ఎక్కడ||
1. విశ్వానికి మూలం శబ్ధం శబ్ధానికి దేవుడు కారణం
బైబిల్ గ్రంథం దీనికి సాక్ష్యం (2)
బిగ్‌బ్యాంగ్ వలన విశ్వం పుట్టిందని
శాస్త్రం చెప్పింది
శాస్త్రవేత్త చెప్పక ముందే బైబిల్ చెప్పింది
శాస్త్రవేత్త చెప్పిన సిద్దాంతం
బైబిల్ నుండి కాపీ కొట్టిందే
ముద్రణ యంత్రం కనుగొనగానే
ముద్రించిన తొలి పుస్తకం
అదే బైబిల్ (2) ||జ్ఞాని ఎక్కడ||
2. ఆర్యభట్ట సిద్దాంతం తప్పని చెప్పింది శాస్త్రం
ఎడ్మండ్ హేలీ దీనికి సాక్ష్యం (2)
క్రీస్తు పుట్టాడని తెలుపుటకు నక్షత్రం నడిచింది
ఎడ్మండ్ హేలీ పుట్టక ముందే బైబిల్ చెప్పింది
సృష్టిని పరిశీలించిన శాస్త్రం
బైబిల్ నడిగితే ముందే చెబుతుంది
ముద్రణ యంత్రం కనుగొనగానే
ముద్రించిన తొలి పుస్తకం
అదే బైబిల్ (2) ||జ్ఞాని ఎక్కడ||
3. మానవ నివాసయోగ్యం భూమి మాత్రమే మనిషికి యోగ్యం
గ్రహంతర జీవులు లేవని బైబిల్ సాక్ష్యం (2)
నవగ్రహాలున్నాయని చెప్పి పాఠం నేర్పింది
ఫ్లూటో గ్రహం కాదని మాటను మార్చింది
గ్రహాలలో జీవన్నది లేదని బైబిల్ మాత్రమే సవాలు చేస్తుంది
ముద్రణ యంత్రం కనుగొనగానే
ముద్రించిన తొలి పుస్తకం
అదే బైబిల్ (2) ||జ్ఞాని ఎక్కడ||
Gnani Ekkada Song Lyrics in English