Songs Home Page All Telugu Christian Songs All BOUI Songs
గర్భఫలము దేవుడిచ్చు బహుమానం (2)
కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్ధ్యము
నిదురించే తన ప్రియులకు
వెలలేని ఒడిలోని ప్రేమానుబంధము
వెలలేని విడిపోని తన ప్రేమ బంధము ||గర్భఫలము||
1. పరాయి బిడ్డను ఏ ఒక్కరు
తన బిడ్డగా అంగీకరింపరు (2)
ఒకవేళ చూచినా మీ పిల్లలతో
సమానముగా చూడలేరు
మన మనసెరిగిన దేవుడు తన బిడ్డనే
మీ బిడ్డగా మీ గర్భంలోనే రూపిస్తున్నాడు
వివాహానికిదే అర్ధం
దీనిలోనే పరమార్ధం (2) ||నిదురించే||
2. ప్రతి బహుమానం తన కొరకే
పెంచాలని మీకిచ్చాడు దేవుడు (2)
వాక్యమెరుగక దేవునికై బ్రతకక
నరకానికందరూ పోవుట న్యాయమా ? (2)
మీ తండ్రి పనుల మీదుండాలని మీరెరుగరా?
మీ తరమువారికి సేవచేసి నిద్రించరా ?
మనిషి జన్మకిదే అర్ధం
దీనిలోనే పరమార్ధం (2) ||నిదురించే||
Garbhaphalamu Devudichchu Bahumanam Song Lyrics in English