Songs Home Page All Telugu Christian Songs All BOUI Songs
ఎన్నెన్నో శ్రమలను భరియించి మనము
పరలోకం చేరాలిలే
క్రైస్తవుడైనందుకు బాధని తెలిసి
బాధనుభవించాలిలే
సుఖమే లేదు ఈ జగతిలో
సుఖపడలేదు యేసు తనబ్రతుకులో
మనకోసం యేసు ఆసిలువలో
బలియైనాడు యేసు కల్వరిపై
మరణించి లేచాడని ప్రకటించు ఓ సోదరా…
అపవాదిని ఓడించి గెలవాలి ఓ సోదరా… ||ఎన్నెన్నో||
1. నీ కివ్వాలనుకున్నాడా పరలోకం
దూతలకెన్నడు లోపరచేలేదు
పరలోకం పొందాలని పోరాటం చేసి
దయ్యంగా మారింది ఒకదూత నీ కోసమే (2)
పడద్రోయబడెను ఈ భువిపై
బహుక్రోధంగా వచ్చాడు నీపై
పాపంలో పడవేసెను నిన్ను
పాతాళానికి పంపాలని నిన్ను
బహుక్రోధంగా సింహమువలె గర్జించెను
సుఖమే లేదు ఈ జగతిలో
సుఖపడలేదు యేసు తనబ్రతుకులో
మనకోసం యేసు ఆసిలువలో
బలియైనాడు యేసు కల్వరిపై
మరణించి లేచాడని ప్రకటించు ఓ సోదరా…
అపవాదిని ఓడించి గెలవాలి ఓ సోదరా… ||ఎన్నెన్నో||
2. దేవుని నమ్మి హింసలు పొందారు
హతసాక్షులుగా సాక్ష్యం పొందారు
పరదైసులో ఉన్నారు ఎదురు చూస్తున్నారు
పరలోకం పొందాలని ఉన్నారు మనకోసమే (2)
రంపములతో కోయబడినారు కొరడాలతో కొట్టబడినారు
దేవునికై ప్రాణాలిచ్చారు చావైతేనే లాభం అన్నారు
బహు కౄరంగా శ్రమపొంది మృతినొందారు
సుఖమే లేదు ఈ జగతిలో
సుఖపడలేదు యేసు తనబ్రతుకులో
మనకోసం యేసు ఆసిలువలో
బలియైనాడు యేసు కల్వరిపై
మరణించి లేచాడని ప్రకటించు ఓ సోదరా…
అపవాదిని ఓడించి గెలవాలి ఓ సోదరా… ||ఎన్నెన్నో||
Ennenno Sramalanu Bhariyinchi Song Lyrics in English