ఈ సృష్టి కలిగించి నడిపించినది దైవమే | Ee Srushti Kaliginchi Nadipinchinadi Daivame

Songs Home Page       All Telugu Christian Songs       All BOUI Songs


ఈ సృష్టి కలిగించి నడిపించినది దైవమే…
ఈ భూమి పై ఉన్న నరులంత తనపిల్లలే …
నీ కోసమే ఎదురు చూసాడని
ఈ తరములో నీవు రావాలని
తన మహిమకే కీర్తి తేవాలని నేస్తమా…
దేవుని ఆశ తనకు పిల్లలు కావవాలని
ఆ తండ్రి పనిలోనే బ్రతుకంతా సాగాలని (2) ||ఈ సృష్టి||

1. మోషే వలే నడిపించుము విసిగించినా మాట నువ్వు మరువకు
ఏ పదవినీ ఆశించకు శోధించినా నీవు పని మానకు
అవమానమే ఎదురయ్యినా బహుమానమే ఉంది గురి చూడుము
దేవుని ఆశ నీవే కావాలని.. దేవుని ఆశ తనకు పిల్లలు కావవాలని..
ఆ తండ్రి పనిలోనే బ్రతుకంతా సాగాలని ||ఈ సృష్టి||

2. ప్రభు యేసులా పని చేయుము సాతాను శోధిస్తే ఎదిరించుము
లోకాశలే కలిగించినా వాక్యానికే నీవు తలదించుము
తలిదండ్రులే వదిలేసినా మన తండ్రి పని మీదే ఉండాలని
దేవుని ఆశ నీవే కావాలని.. దేవుని ఆశ తనకు పిల్లలు కావవాలని..
ఆ తండ్రి పనిలోనే బ్రతుకంతా సాగాలని ||ఈ సృష్టి||


Ee Srushti Kaliginchi Nadipinchinadi Daivame Song Lyrics in English

Scroll to Top