Songs Home Page All Telugu Christian Songs All BOUI Songs
ఈ జన్మను ఇచ్చింది దేవుడే, స్త్రీ పురుషులను కలిపాడు దేవుడే
భూమిని నిండించాడలని పని చెప్పాడు
దేవుని కొరకే ఇద్దరు ఒకటయ్యారు (2)
తెలుసుకో నీ తండ్రి దేవుడే, ఆ తండ్రి గూర్చి తెలపాలి తలిదండ్రులే ||ఈ జన్మను||
1. పుట్టకముందే నీవు ఎక్కడ ఉన్నావో, వచ్చిన లోకం నీకు తెలుసా? (2)
ఆదామవ్వల నుండె వచ్చావు అదామవ్వను దేవుడు చేసాడు
దేవుని నుండె నీవు వచ్చావు దేవుడు సృష్టిని నీకు ఇచ్చాడు
తెలుసుకో నీ తండ్రి దేవుడే, ఆ తండ్రి గూర్చి తెలపాలి తల్లిదండ్రులే ||ఈ జన్మను||
2. దేవుడు ఉండే లోకం నీదని మరిచావు అందు కే యేసొచ్చాడు తెలుసా? (2)
లోకం వదిలి నీవు వెళ్లాలి అందుకే మరణం నీకు రావాలి
మరణించిన తరువాతే వెళ్లాలి దేవుని ఇపుడే అందరూ నమ్మాలి
తెలుసుకో నీ తండ్రి దేవుడే ఆ తండ్రి గూర్చి తెలపాలి తల్లిదండ్రులే ||ఈ జన్మను||
Ee Janmanu Ichchindi Devude Song Lyrics in English