Songs Home Page All Telugu Christian Songs All BOUI Songs
ఏది సొంత ఊరూ… ఎవరు సొంతవారు…
చావుతో ఈ లోకాన్ని విడిచి పెట్టు ఓ మనిషి…
ఏది సొంత ఊరూ ఎవరు సొంతవారు
నీవారే నీకు కారు… నీవారే నీకు కారు… ||ఏది సొంత||
1. తన మరణకాలమందు యాకోబు చెప్పెను
స్వజనులంటే మీరు కాదు
తన బ్రతుకు కాలమందు అబ్రాహాము చెప్పెను
ఈ లోకం మీదికాదు
పరదేశులం, యాత్రికులం పరజనులం, పరలోక నివాసులం
పితరులున్న చోటుకే చేర్చబడేదవో
ధనవంతుని చోటుకే వెళ్లిపోదువో ||ఏది సొంత||
2. తన బ్రతుకు కాలమందు క్రీస్తు శిష్యులతో చెప్పెను
ఈ లోకం మీది కాదు తన కన్న తల్లిదండ్రిని
ఎక్కువ ప్రేమించువాడు నా ప్రేమకు పాత్రుడు కాడు
పరలోకమే నీ దేశం పరమాత్ముడే నిను కన్న నీ తండ్రి
దేవుడున్న లోకమే సొంత ఊరు
దేవుని పని చేయువారే సొంతవారు ||ఏది సొంత||
Edi Sonta Ooru Song Lyrics in English