Songs Home Page All Telugu Christian Songs All BOUI Songs
దేవునికి భయపడని వారికి చివరి ఘడియ ఇది
దైవాన్ని నమ్మిన క్రైస్తవులకు మేలుకొలుపె ఇది
ఈ ప్రకృతే దేవుని ఆయుధం (2)
మార్పు లేని మనిషిని శిక్షంచడానికి
మనిషిపై వస్తుంది ఈ ప్రళయం
తనలెక్క పూర్తయినంత వరకూ ఆగదీ ప్రళయం
మార్పు పొందు ఈ దినం లేకపోతే తుది దినం ||దేవునికి||
1. నీతిమంతులు లేకపోతే పాపులందరు పెరిగిపోతే
ఎంతకాలం మనిషిని భూమిపై ఉంచాలిరా ?
మనిషి కోసం పరితపించే దేవుడిని ప్రక్కనే పెడితా
మనిషినీ ఈ భూమిపై ఎందుకు ఉంచాలిరా ?
అగ్ని నీరు గాలి నింగి నేల సారం అనుభవిస్తూ
సృష్టికర్తను దిక్కరిస్తే ప్రకృతే గర్జించదా ?
ప్రకృతే కన్నెర్ర చేసిందా? పరమాత్ముడే ఉగ్రుడైనాడా?
ఈ ప్రకృతే దేవుని ఆయుధం నీ పాపమే దీనికి కారణం
మార్పు లేని మనిషిని శిక్షంచడానికి మనిషిపై
వస్తుంది ఈ ప్రళయం తన లెక్క పూర్తయినంత
వరకూ ఆగదీ ప్రళయం
మార్పు పొందు ఈ దినం
లేకపోతే తుది దినం ||దేవునికి||
2. మనిషి మనిషిని చంపుతుంటే ఉగ్రవాదం పెరుగుతుంటే
నరుడు మృగముగ మారితే ఎందుకు ఉంచాలి రా…
దుష్టులందరు పెరుగుతుంటే రక్తపాతం జరుగుతుంటే
నరుల పాపం పండితే ఎందుకు ఉంచాలిరా…
నేల నాదని, నింగి నాదని, దేవుడంటే లెక్కలేదని
సృష్టికర్తను ధిక్కరిస్తే ప్రకృతే గర్జించదా…
పెనుగాలి నాపే దమ్ములేదు మనుషులెవ్వరికీ
జలప్రళయమాపే దమ్ములేదధికారులెవ్వరికీ
ఈ ప్రకృతే దేవుని ఆయుధం నీ పాపమే దీనికి కారణం
మార్పులేని మనిషిని శిక్షించడానికి మనిషిపై
వస్తుంది ఈ ప్రళయం తనలెక్క పూర్తయినంత
వరకూ ఆగదీ ప్రళయం
మార్పు పొందు ఈ దినం లేకపోతే తుది దినం ||దేవునికి||
Devuniki Bahayapadani Variki Song Lyrics in English