Songs Home Page All Telugu Christian Songs All Anonymous Songs
దేవుని వాక్యం రెండంచుల ఖడ్గం
అవిధేయ బ్రతుకులకది ఆయుధం
సాతానును ఎదిరించే సాధనం (2)
చీకటిగల బ్రతుకులకది దీపమూ
పాపపు రోగానికి అది ఔషధమూ (2) ||దేవుని వాక్యం||
1. కీళ్ళను నరములను అది విభజిస్తుందీ..
హృదయాంతరంగాలను శోధిస్తుందీ (2)
కఠన హృదయాలనది కరిగిస్తుందీ…
పరలోక రాజ్యమునకు నడిపిస్తుందీ (2) ||చీకటిగల||
2. రక్షణ ఎదుగుటకది పాలవంటిదీ..
నరకములో కాల్చుటకది జ్వాలవంటిదీ.. (2)
మనసు మార్చుకొంటే మహాత్మునిగా చేస్తుంది
కఠనపరచుకొంటే శాసనం వ్రాస్తుందీ (2) ||చీకటిగల||
Devuni Vakyam Rendanchula Khadgam Song Lyrics in English
You must be logged in to post a comment.