దేవుని కష్టం | Devuni Kashtam

Songs Home Page       All Telugu Christian Songs       All BOUI Songs


దేవుని కష్టం మనిషికి తెలుసా?
ఆ దేవుని ఇష్టం మనిషికి తెలుసా?
ప్రకృతి కలిగించి ప్రకృతి ఒడిలో నిను ఉంచి (2)
నడిపించాడు నీ కోసం ఈ విశ్వం
కురిపించాడు నీ కోసం ఈ వర్షం ||దేవుని కష్టం||

1. కోట్లమంది దేవదూతలే పొగిడినా
కోట్లమంది సేవకులే పనిచేసినా
మనిషి మారలదేని తనను నమ్మలేదని
ఎదురు చూచుచున్నాడు ప్రతిరోజు (2)
మంచి పోతుంది నిదురలోనే నీ తల్లయినా
నిన్ను విడువడు ఆ దేవుడు ఎపుడైనా (2)
నిన్ను విడువడు ఆ దేవుడు ఎపుడైనా ||దేవుని కష్టం||

2. కోట్లమంది క్రైస్తవులే ప్రార్ధించినా
వాక్యం వినకుండా పాపి మారునా?
సర్వలోకమెవరెళతారని సువార్తెవరు ప్రకటిస్తారని
ఎదురుచూచుచున్నాడు ప్రతిరోజూ (2)
తండ్రి మనసులో ఉన్న కోరికలు తీర్చారా?
మీకున్న బాధలను తీర్చమని మొరపెడతారా? (2)
ఆ తండ్రి వేదనను తెలుసుకొని సుఖపెడతారా? ||దేవుని కష్టం||


Devuni Kashtam Song Lyrics in English

Scroll to Top