Songs Home Page All Telugu Christian Songs All BOUI Songs
దేవుడు భూమిని ఆకాశమునే కలుగజేసెన్
ఆరు దినాలలో సృష్టిని చేసి నీకు ఇచ్చెన్ (2)
తన కోసమే నిను చేసెనూ ఈ సృష్టినే నీకిచ్చెను
దేవుడే లేనిదే ఈ సృష్టి లేనే లేదు నీకిదీ…
ఆ దేవుడే ఉన్నాడని నీ తండ్రి దేవుడనీ తెలియాలని (2)
నీ కోసమే ఎదురు చూసి నువు మారితే పొంగిపోయి
ఇలా ప్రేమించాడు నిన్నే ||దేవుడు భూమిని||
1. వీచే చల్లగాలి నిను తాకే చల్లగాలి
నీ కొరకు దేవుడే చేయలేదా? (2)
కురిసే ప్రతి చినుకు నీ కోసమేగా…
నీ దాహం తీర్చుటకే చేసాడు గదా…
ప్రతీ క్షణం తన ప్రేమే తెలుపలేదా… ||దేవుడు భూమిని||
2. యేసునే ఇవ్వలేదా? నీ పాపం తియ్యలేదా?
నీ కొరకు దేవుడే పంపలేదా? (2)
ప్రతి మనిషికి ఆ దేవుడు తండ్రి గదా
తన పిల్లలు తన యొద్దకు రావాలి గదా
ప్రతి క్షణం నీ కోరికే తీర్చలేదా? ||దేవుడు భూమిని||
Devudu Bhoomini Song Lyrics in English