Songs Home Page All Telugu Christian Songs All BOUI Songs
దేవుడెన్ని చేసిన మనిషికెంత ఇచ్చినా
నమ్మలేదు మనుష్యులు ఒక దేవునినే
సృష్టినంత చూసినా చేసిందతనేఅన్నా
నమ్మకమే లేదు తన పిల్లలకే
అతనొకడే నీ తండ్రి అతనొకడే నీ దేవుడు
మీరంతా పిల్లలని మీకు తెలియదా? (2)
ఆ దేవునినే ఏడిపిస్తున్నారు నమ్మక
సాతాను మాయలో ఉన్నారని అది తెలియక ||దేవుడెన్ని||
1. సృష్టినంత చేసి ఆకలంత తీర్చి
మొదటి మనిషికే ఇచ్చింది ఎవరు
ఆదాము హవ్వలకు దేవుడొక్కడే ఉంటే
మీకందరికి ఆ దేవుడు ఎవరూ (2)
ఒక్క దేవుడే అందరిని చేసాడు గదా
ఆదాము నుండే మీరందరు వచ్చారు గదా?
అందరికి ఒక దేవుడని మీకు తెలియదా?
ఒక కుటుంబానికే తండ్రొకడని అది తెలియదా?
పతియే ప్రత్యక్ష దైవమా భార్యలంతా దేవతలా? (2)
నమ్మలేని ఈ మనుష్యులకు స్వర్గం ఇచ్చేదెలా? ||దేవుడెన్ని||
2. తలిదండ్రులే నమ్మిన దేవుని నువు నమ్ముకున్నావా?
ఆదామే నమ్మిన దేవుని నమ్మావా? (2)
ఆదాము హవ్వలకు దేవుడు తండ్రే అయితే
ఆ దేవుడు దేవుడని నమ్మలేవా (2)
ఒక్క దేవుడే అందరిని చేసాడు గదా
ఆదాము నుండే మీరందరు వచ్చారు గదా?
అందరికి ఒక దేవుడని మీకు తెలియదా?
ఒక కుటుంబానికే తండ్రొకడని అది తెలియదా?
పతియే ప్రత్యక్ష దైవమా భార్యలంతా దేవతలా? (2)
నీ కన్న తండ్రినే లేడంటే నిను నమ్మించడమే ఎలా? ||దేవుడెన్ని||
Devudenni Chesina Song Lyrics in English