Songs Home Page All Telugu Christian Songs All BOUI Songs
దేవాది దేవుడు నీకోసమే సర్వాన్ని అర్పించాడు
ఆ యేసునే నీ పాపానికే ప్రాణాలతో ఇచ్చాడు
పాతాళమెళితే రాలేవనీ బ్రతికుండగా తెలుసుకోవాలనీ
తనకున్నవన్ని దేవుడిచ్చాడు నువ్వు నమ్ముతావని ఎదురు చూసాడు
ఏ రోజైనా నువ్వు కలుసుకోవా! ఆ దేవుడెవరో తెలుసుకోవా!
మరణించి లోకాన్నే విడిచిపోవా! నీ తండ్రినే చూసి మురిసిపోవా!
1. పురుగుల మందును త్రాగేసావు పురుగు కంటే ముందే మరణించావు
చావే ముగింపని అనుకున్నావు ఏ బాధ లేదని వెళ్లిపోయావు
వెళ్లింది శవమే కాటికి చేరింది ఆత్మే అగ్నికి
అది తెలియకే నీ ప్రాణం తీసావు ఏ బాధ లేదని మోసపోయావు
||ఏరోజైనా||
2. తల్లి తండ్రిని గుర్తు పట్టేసావు నిన్ను కన్నవారెవరో చెప్పేసావు
భార్యపిల్లలకోసం బ్రతికేసావు వారే సొంతమనీ నీవు నమ్మేసావు
కన్నది నిన్ను దేవుడే ఈ తల్లిని ఇచ్చిందీ దేవుడే
ఇది తెలియకే ఆ దేవున్నే మరిచావు ఆ దేవుడే లేడని బ్రతికావు
||ఏరోజైనా||
Devadi Devudu Neekosame Song Lyrics in English