Songs Home Page All Telugu Christian Songs All BOUI Songs
చనిపోతే బ్రతుకుందా? ఈ బ్రతుకులో సుఖముందా?
విత్తనం చచ్చితే ఎలా బ్రతుకుతుంది (2) ||చనిపోతే||
1. ఈ బ్రతుకులో సుఖమేముంది ఆ సుఖములో బ్రతుకెంతుంది
స్వర్గం, నరకం శాశ్వతమే అని తెలుసా…
అది శాశ్వత సుఖము దుఃఖం ఆత్మకు తెలుసా… (2)
ఒక విత్తనంలో బ్రతుకేంతుంది మహ వృక్షమే దానిలో వుంది
మనిషి దేహన్ని నడిపే ఆత్మకు ఈ బ్రతుకుంది
చనిపోతే వెళ్ళే ఆత్మకు మళ్ళీ బ్రతుకేంతుంది ||చనిపోతే||
2. చనిపోతే వెళ్ళేది నీలో ఆత్మే – నువు చేసిన క్రియలను బట్టి దానికి తీర్పే (2)
నీ మరణ దినమే అది వెలుతుంది ఒక క్షణములో శిక్ష పడుతుంది
ఆరని అగ్నిలో చావని ఆత్మకు బాదెంతుంది
ఆ దేవుని మరచి బ్రతికినందుకే శిక్ష ఉంటుంది ||చనిపోతే||
Chanipote Bratukunda Song Lyrics in English