Songs Home Page All Telugu Christian Songs All BOUI Songs
ఆ దేవుడే నీ తండ్రని నేర్పాలి తలిదండ్రి ఒడిలో
ఆ దేవుడే సృష్టి చేసాడని నేర్పాలి ఆ చిన్ని మదిలో
కూర్చున్నపుడే త్రోవను నడిచేటపుడే
పడుకున్నపుడే నిద్రలేచేటపుడే
దేవుని గూర్చిన జ్ఞానము నేర్పించుము
నీ గర్భంలో ఉన్నపుడే వినిపించుము ||ఆ దేవుడే||
1. తల్లే దైవమని.. తండ్రే దేవుడని.. (2)
గురువే దైవమనే పాఠాలే చెప్పకు (2)
తల్లి తండ్రి గురువును చేసింది ఆ దేవుడే
దేవుని కంటే ముందు వీరెవరు లేరులే
గాలి నీరు ఆహారం ఎవరిచ్చారు (2)
నీ తల్లి నడిగి, తండ్రినడిగి, గురువు నడిగి చెప్పు ||ఆ దేవుడే||
2. ధనమే దైవమని చదువే ధ్యేయమని (2)
పతియే దైవమనే పాఠాలే చెప్పకు (2)
సతిని పతిని చేసింది దేవుడని తెలుసుకో
దేవుని కంటే ముందే లేరెవరని తెలుసుకో
గాలి నీరు ఆహారం ఎవరిచ్చారు (2)
నీ సతిని అడిగి, నీ పతిని అడిగి, అతిధి నడిగి చెప్పు
ఆ దేవుడే నీ తండ్రని నేర్పాలి తల్లితండ్రి ఒడిలో…
ఆ దేవుడే సృష్టి చేసాడని నేర్పాలి ఆ చిన్ని మదిలో…
(ఎ) ఆల్‌మైటి, (బి) ఫర్ బైబిల్
(సి) ఫర్ క్రైస్ట్ (డి) ఫర్ డాడి
యువర్ డాడి.. యువర్ డాడి.. ఆ దేవుడే..
Aa Devude Nee Tandrani Song Lyrics in English