Songs Home Page All Telugu Christian Songs All BOUI Songs
ప్రతి మనిషికి చరిత్ర ఉంది
బైబిలే దాన్ని తెలుపు తుంది
మనుషులందరిదీ మరో లోకముంది (2)
జీవగ్రంధంలో జ్ఞానముంది
శాస్త్రవేత్త తల దించుతుంది
చదువుతానంటే చరిత్ర ఉంది
అది సకల శాస్త్రాల
నధిగమించినది బైబిలు (2) ||ప్రతి మనిషికి||
1. జీవశాస్త్రమే ఎరుగని జీవిత చరిత్ర
జీవగ్రంధమే చెప్పిన మనిషి చరిత్ర (2)
ప్రతి మనిషి ఈ భూమిపై
ఒక మనిషి నుండే పుట్టాడని చెప్పింది (2)
నరుడు మృగము నుండి రాలేదని
మృగము రక్త మెక్కించలేరని (2)
జీవశాస్త్రాన్ని సవాలు చేసి
నిలదీస్తుందీ జీవగ్రంధమే…
అది సకల శాస్త్రాల
నధిగమించినది బైబిలు (2) ||ప్రతి మనిషికి||
2. ఆదియందు దేవునిలో
మనమే ఉన్నవారం
ఆదాములోకి దేవుని నుండి
వచ్చిన వారం (2)
ప్రతి తండ్రి గర్భాన్ని దాటుకుంటూ
తల్లిలో నుండి బయటికి వచ్చిన వారం (2)
ప్రతి మనిషికి ఉన్నది
చరిత్ర తెలుసుకో ఇది నీ గతచరిత్ర (2)
మానవ శాస్త్రం పుటుక్ట ముందే
మానవులందరి మూలం తెలిపెను బైబిలు
అది సకల శాస్త్రాల
నధిగమించినది బైబిలు (2) ||ప్రతి మనిషికి||
Prati Manishiki Charitra Song Lyrics in English