క్రీస్తును ధరించినది ప్రకృతి | Kreestunu Dharinchinadi Prakruti

Songs Home Page       All Telugu Christian Songs       All BOUI Songs


క్రీస్తును ధరించినది ప్రకృతి అని నీకు తెలుసా సోదరా
దైవలక్షణము కలిగున్నది అని నీకుతెలుసా సోదరా
క్రీస్తును నమ్ముటయే కాదు ముఖ్యమని
క్రీస్తును ధరించుటే ప్రాముఖ్యమని
క్రీస్తువలె జీవించుటయ ముగింపు అని
బ్రతుకుటే క్రీస్తనీ చావైతే నీకు లాభమని
బ్రతుకుటే క్రీస్తనీ చావైతే మరి లాభమని ||క్రీస్తును||

1. సులభముగా లోబడినది ఏమనిషిని బలి కోరనిది
పక్షపాతం లేనిది అందరి ఆకలిని తీర్చునది
త్యాగమే దానికి ప్రాణాన్ని ఇస్తుంది మనిషికి (2)
క్రీస్తువలె మృదువైనదీ క్రీస్తు వలె మృదువెనౖదీ
దేవుని లక్షణమిదే అని తెలుపున్నది
దేవుని ప్రేమే నీలో ఉందా?
ఈ ప్రకృతిలోనే కనిపిస్తుందా? (2) ||క్రీస్తును||

2. సూర్యుడు ఉదయించును నీకాలాన్ని గుర్తు చేయును
ప్రతి చెట్టు ఫలియించును ప్రాణవాయువును నీకిచ్చును
త్యాగమే దానికి రోగాన్ని తీస్తుంది మనిషికి (2)
క్రీస్తువలె బలియైనది (2)
దేవుని లక్షణమిదే అని తెలుపుతున్నది
దేవుని తత్వం నీలో ఉందా?
ఈ ప్రకృతిలోనే కనిపిస్తుందా? (2) ||క్రీస్తును||


Kreestunu Dharinchinadi Prakruti Song Lyrics in English

Scroll to Top