మేము ప్రతిజ్ఞ చేయునదేమనగా..
పరలోకపు ప్రతిజ్ఞ
- దేవుడే నా తండ్రి! పరలోకమే నా దేశం!!
- నా శాశ్వతమైన పౌరస్థితి పరలోకమందున్నది, దానిని నేనెల్లప్పుడూ జ్ఞాపకముంచుకుంటాను.
- ప్రపంచ ప్రజలందరూ నా సోదర సోదరీమణులు.
- నా దేవున్ని, నా తల్లిదండ్రులను మరియు పెద్దలందరినీ ఎల్లప్పుడూ నేను గౌరవిస్తాను.
- కుల, వర్గ వివక్షను, అంటరానితనాన్ని ద్వేషించి, నన్ను ప్రేమించువారిని మాత్రమే కాక, నా శత్రువులను కూడా నేను ప్రేమిస్తాను.
- పర్యావరణాన్ని కాపాడుతూ, పశుపక్ష్యాదులపట్ల దయ కలిగి ఉంటాను.
- శరీరాశ, నేత్రాశ, జీవపుడంబములను అసహ్యించుకుని, దేవుడిచ్చిన శరీరంతో సత్క్రియలు చేస్తూ, నా అవయవములను నీతికి సాధనములుగా మాత్రమే వినియోగిస్తాను.
- అపవాది తంత్రములనుండి దీనులైన ప్రజలను రక్షించుటకు, దేవుని వాక్యమనే ఆత్మఖడ్గమును చేతబట్టి, ఒక సైనికునివలె నా జీవితమంతా పోరాడతాను.
- తండ్రియైన నా దేవుని ప్రేమించి, రక్షకుడైన యేసుక్రీస్తును ధరించుకుని, పరిశుద్ధాత్ముని సహకారముతో న్యాయముగా నడచుకొందునని ప్రతిజ్ఞ చేయుచున్నాను.
- దేవుని సంతోషమే నా ఆనందానికి మూలం మరియు విశ్వశాంతికి కారణం!
పరలోకపు ప్రతిజ్ఞను మీ జీవితకాలమందు పాటించండి!
నేను దేవుని పవిత్ర వాక్యమైన బైబిల్‌కు విధేయత చూపుతాను, నేను దానిని నా పాదాలకు దీపంగా మరియు నా మార్గానికి వెలుగుగా చేస్తాను మరియు నేను దేవునికి వ్యతిరేకంగా పాపం చేయకుండా దాని మాటలను నా హృదయంలో దాచుకుంటాను.
You must be logged in to post a comment.