Nityajeeva Parishodhana

We have organized the Eternal Life Research, International Bible Conference every year from January 13th to 17th from 2016 to 2022. These conferences, consisting of about ten sermons and five lectures, were held according to the will of the Lord. We inform you that many aspirants have gained the great knowledge of God through this great program called Eternal Life Research.
Timetable:
First sermon: 11:00 AM to 12:30 PM
Second sermon: 3:00 PM to 4:30 PM
Daily sermon: 7:00 PM to 8:30 PM
In this way, from January 13th to 17th, five sermons will be taught in the morning, five sermons in the afternoon, and five sermons in the evening. There is an opportunity to share the Word of God with many people and lead them in the knowledge of God.
Candidates who want to learn the knowledge of God through eLearning and then write exams on the topics learned can register their details in the Registration Form. Write this practice exam for a sample exam paper. For more details and for doubt clearing, contact 8978414178. The main speakers of this are the General Secretary of Scriptures University and Christ Church Asia Correspondent, Man of God. Mani Kumar will deliver the speech.

నిత్యజీవ పరిశోధన, అంతర్జాతీయ బైబిల్ సదస్సును 2016 నుండి 2022 వరకు ప్రతి సంవత్సరం జనవరి మాసము 13వ తేదీ నుండి 17వ తేదీ వరకు నిర్వహించినాము. సుమారు పది ఉపదేశములు మరియు ఐదు ఉపన్యాసములతో కూడిన ఈ సదస్సులు ప్రభువు చిత్తమునుబట్టి జరిగించబడెను. అనేకమంది ఆశావహులు నిత్యజీవ పరిశోధన అనే ఈ మహా కార్యక్రమము ద్వారా దేవుని మహా జ్ఞానమును పొందినారని తెలియపరచుచున్నాము.
సమయసూచిక:
మొదటి ఉపదేశము: ఉదయం 11:00 గంటల నుండి 12:30 గంటల వరకు
రెండవ ఉపదేశము: మధ్యాహ్నం 03:00 గంటల నుండి 04:30 గంటల వరకు
రోజువారి ఉపన్యాసము: సాయంత్రం 07:00 గంటల నుండి 08:30 గంటల వరకు
ఈ విధముగా జనవరి 13వ తేది నుండి 17వ తేది వరకు ఉదయపు వేళ ఐదు ఉపదేశములు మరియు మధ్యాహ్నపు వేళ ఐదు ఉపదేశములు, సాయంత్రం వేళ ఐదు ఉపన్యాసములు బోధించబడును. దేవుని వాక్యమును మీతోపాటు అనేకమందికి వినిపించి దైవజ్ఞానములో వారిని కూడా నడిపించే అవకాశము కలదు.
బిలెర్నింగ్ ద్వారా దేవుని జ్ఞానమును నేర్చుకొని ఆ తరువాత నేర్చుకున్న అంశములపై పరీక్షలు వ్రాయగోరు అభ్యర్ధులు Registration Form నందు మీ వివరములను నమోదు చేసుకోగలరు. పరీక్షా పత్రము నమూన కొరకు ఈ ప్రాక్టీస్ పరీక్షను వ్రాయండి. మరిన్ని వివరములకు మరియు సందేహ నివృత్తి కొరకు 8978414178 ను సంప్రదించండి. ఇందు ముఖ్య వాక్యోపదేశకులుగా స్క్రిప్చర్స్ యూనివర్సిటి ముఖ్య కార్యదర్శి మరియు క్రైస్ట్ చర్చ్ ఆసియ వర్తమానికులు దైవజనులు. మణి కుమార్ గారు ప్రసంగించెదరు.

ఆదికాలము నుండి ఆధునిక కాలము వరకు మానవ పురోగతి అంతా పరిశోధనపైనే ఆధారపడినది అనుటలో ఎటువంటి సందేహమూ లేదు. కానీ ఆ పరిశోధనంతా దేనికొరకు? ఎంతవరకు?  కనిపించేదైనా కనిపించనిదైనా క్షయమైన దాని కొరకు మాత్రమే ఆలోచించే మనిషి, అక్షయమైన దాని కొరకు తన జీవిత కాలములో ఏనాడూ ఆలోచించలేదు. అందుకే మనిషిలో కనిపించే అభివృద్ధి అంతా కేవలం  మట్టి లోకానికే తప్ప, మహిమ లోకానికి మాత్రం కాదు. మనిషి ఎక్కడ నుండి ఈ భూమి మీదకి వచ్చాడన్న ప్రశ్నతో ప్రారంభమై; మరణించిన తరువాత ఎక్కడికి వెళ్లాలన్న ప్రశ్న వరకు.. అనేక ఆత్మ సంబంధమైన సందేహములకు దేవుని గ్రంధము నుండి సమాధానాలను  పరిశోధింపజేసే మహోన్నతమైన కార్యక్రమమే ‘నిత్యజీవ పరిశోధన’ అను అంతర్జాతీయ ఆన్లైన్ బైబిల్ సదస్సు!

Scroll to Top